Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

కేంద్రం నుంచి చంద్రబాబుకు మరోసారి పిలుపు… డిసెంబర్ 5 న ఢిల్లీకి చంద్రబాబు

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు కేంద్రం నుంచి మరోసారి పిలుపు వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే దేశంలోని రాజకీయ పార్టీల అధ్యక్షుల భేటీకి హాజరు కావాలి కేంద్రం కోరింది. జీ 20 సమావేశాలకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. డిసెంబర్ 1, 2022 నుంచి నవంబర్ 30,2023 వరకూ జీ 20 సమావేశాలకు భారత్ అధ్యక్షత వహిస్తుంది. ఈ నేపథ్యంలోనే వీటి గురించి చర్చించేందుకు వచ్చే నెల 5 న రాష్ట్రపతి భవన్ లో అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా వారందరి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు.

 

ఈ సమావేశానికి హాజరు కావాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి చంద్రబాబుకు ఆహ్వానం పంపారు. కేంద్రం ఆహ్వానం పంపడంతో డిసెంబర్ 5 న చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇటీవల జరిగిన ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సమావేశానికి కూడా చంద్రబాబును కేంద్రం ఆహ్వానించింది. ఆ సమావేశంలో ప్రధాని మోడీ.. చంద్రబాబుతో మాట్లాడిన విషయం తెలిసిందే.

Related Posts

Latest News Updates