ఆస్కార్ అవార్డు సాధించిన అనంతరం RRRటీమ్ తిరిగి హైదరాబాద్ కి చేరుకుంది. శుక్రవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. వారందరితో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు తెగ ఆసక్తి చూపారు. దీంతో అక్కడ తీవ్రమైన రద్దీ నెలకొంది. కీరవాణి, రాజమౌళి, రాజమౌళి సతీమణి రమ, కార్తికేయ, కాలభైరవ, శ్రీసింహ తదితరులకు ఘన స్వాగతం లభించింది. అయితే.. స్పందించమని కోరగా రాజమౌళి జై హింద్ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కట్టు దిట్టమైన భద్రత నడుమ కీరవాణి, రాజమౌళి ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వచ్చారు. RRR సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ రావడం సంతోషంగా ఉందని రాజమౌళి, కీరవాణి తెలిపారు.