నిత్యావసర ఉత్నత్తులపై జీఎస్టీ బాదుడు ప్రారంభమైంది. 25 కిలోలు, 25 లీటర్లు, అంతకంటే తక్కువ పరిమాణంలో వుండే ప్యాకేజ్ ఆహారోత్పత్తులపై కొత్తగా 5 శాతం జీఎస్టీ పడుతుంది. జీఎస్టీ పెరగడంతో ప్రముఖ సంస్థలు తమ తమ ఉత్పత్తులపై ధరలు పెంచేసింది. పెరుగు, మజ్జిగ, పనీర్ పై జీఎస్టీ 12 నుంచి `18 శాతానికి పెరిగిపోయింది. బటర్ మిల్క్, పెరుగు, లస్సీ ధరలను 5 శాతం పెంచినట్లు అమూల్ ఇప్పటికే ప్రకటించేసింది. కొత్త జీఎస్టీ రేట్ల ప్రకారమే ధరలను కూడా సవరిస్తున్నట్లు ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థలు కూడా ప్రకటించాయి.
ఇక.. ప్యాక్ చేసి విక్రయించే గోధుమ పిండి, మైదా వంటి పిండ్లు, బియ్యం, గోధుమ ధాన్యాలకు కూడా ఈ జీఎస్టీ వర్తిస్తుంది. అయితే… వీటిని ప్యాక్ చేసిన దానిలో కాకుండా మామూలుగా కొనుగోలు చేస్తే మాత్రం జీఎస్టీ వుండదని జీఎస్టీ మండలి స్పష్టం చేసింది. లూజ్ గా, లేదా బహిరంగ విక్రయాలపై జీఎస్టీ ఏమాత్రం వర్తించని, వీటితో పాటు 14 వస్తువుల జాబితాను కూడా దీని నుంచి మినహాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించారు. నిత్యావసర వస్తువులను బ్రాండెడ్ గా, ప్యాక్ చేసి విక్రయిస్తేనే పన్ను వుంటుందని స్పష్టం చేశారు.