ఏపీలోని పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలంలో కాల్పులు జరిగాయి. మాజీ ఎంపీపీ, టీడీపీ మండల అధ్యక్షుడు బాలకోటిరెడ్డిపై ప్రత్యర్థులు కాల్పులు జరిపారు. మొత్తం 2 రౌండ్ల కాల్పులు జరిపారు. ఆయన ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు కాల్పులు జరిపి, పారిపోయారు. కాల్పుల్లో గాయపడిన బాలకోటిరెడ్డిని కుటుంబీకులు నర్సారావు పేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఇదిలావుండగా కొద్ది నెలల క్రితమే కోటిరెడ్డిపై కత్తులతో దాడి చేయడంతో తృటిలో ప్రాణాపాయ స్థితి నుంచి బాల కోటిరెడ్డి బయటపడ్డాడు. ఇక తాజాగా స్వగ్రామం అలవాలలో కాల్పులతో హత్యాయత్నం మరోసారి కలకలం రేపుతోంది. మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలకోటిరెడ్డిని టీడీపీ నేతలు పరామర్శిస్తున్నారు.
