నటి హన్సిక వివాహం ఘనంగా జరిగింది. తన ప్రియుడు సోహైల్ తో హన్సిక ఏడడుగులు వేసింది. జైపూర్ లోని రాజ్ కోట వేదికగా ఆదివారం రాత్రి సింధి సంప్రదాయం ప్రకారం హన్సిక, సోహైల్ వివాహం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కుటుంబీకులు, స్నేహితులు, సినీ ప్రముఖులు తదితరులు హాజరై, నూతన జంటను ఆశీర్వదించారు.
అయితే… ఈ కార్యక్రమానికి నిరుపేద చిన్నారులను కూడా హన్సిక ఆహ్వానించి, మానవత్వాన్ని చాటుకుంది. ఇక.. ప్రీ వెడ్డింగ్ లో నటి హన్సిక భర్త సోహైల్ తో కలిసి డ్యాన్స్ చేసింది. ఇప్పుడు ఇది నెట్టింట్లో వైరల్ అవుతోంది. వీరిద్దరూ పాటకు తగ్గ స్టెప్పులు వేశారు.