మత్తు వదలరా చిత్రంతో బాక్సాఫీస్ బద్దలు కొట్టిన దర్శకుడు రితేశ్ రానా. 2019 లో రిలీజ్ అయిన మంచి చిత్రాల్లో ఈ సినిమా కూడా స్థానం సంపాదించుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ.. అంటే రెండేళ్ల పాటు రితేశ్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. తాజాగా.. ఇప్పుడు ఆయన హ్యాపీ బర్త్ డే అన్న మూవీని తెరకెక్కించాడు. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్ర. వివేక్ అగస్థ్య కీలక పాత్రలో నటించాడు.
ఈ సినిమా టీజర్ కు ఇప్పటికే జబర్దస్త్ స్పందన కూడా వచ్చింది. అయితే… అనుకున్న తేదీ కంటే వారం రోజుల ముందుగానే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం జూలై 15 న ఈ సినిమా విడుదల కావాలి. కానీ.. వారం రోజుల ముందుగానే సినిమా రిలీజ్ అవుతుందని యూనిట్ తెలిపింది. అంటే జూలై 8 న రిలీజ్.
https://twitter.com/baraju_SuperHit/status/1540555724748574720?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1540555724748574720%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Fcinema%2Flavanya-tripatis-happy-birthday-movie-releasing-on-july8-644141