కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ క్రియాశీల రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తున్నారా? కాంగ్రెస్ ప్లీనరి వేదికగా ఆమె మాట్లాడిన మాటలు అచ్చు అలాగే కనిపిస్తున్నాయి. భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ పూర్తయినట్లేనని, తన ఇన్నింగ్స్ పూర్తికానుండటం సంతోషంగా వుందని సోనియా కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. భారత్ జోడో యాత్ర పార్టీకి ఓ మేలి ములుపుగా అభివర్ణించారు. దేశాన్ని ఓ మలుపు తిప్పిన యాత్ర అని, భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగుస్తుండటం చాలా సంతోషంగా వుందన్నారు. ‘
భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్ ముగుస్తుండటం చాలా సంతోషం కలిగిస్తోంది. దేశాన్ని ఒక మలుపు తిప్పిన యాత్ర ఇది. సామరస్యం, సహనం, సమానత్వాన్ని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని ఈ యాత్ర రుజువు చేసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి, యావద్దేశానికి కూడా ఇది సవాలు వంటి సమయమని, దేశంలోని ప్రతి వ్యవస్థనూ బీజేపీ-ఆర్ఎస్ఎస్ తమ అధీనంలోకి తీసుకుని చిన్నాభిన్నం చేస్తున్న తరుణమని ఆరోపించారు. కొద్దిమంది వ్యాపారవేత్తలకు అనుకూలంగా వ్యవహరించడం దేశ ఆర్థిక పతనానికి కారణమవుతోందని అన్నారు.
కాంగ్రెస్ కేవలం ఒక రాజకీయ పార్టీ కాదని, అన్ని మతాలు, కులాలు, జెండర్ ప్రజల వాణిని ప్రతిబింబిస్తుందని, అందరి కలలను సాకారం చేస్తుందని అన్నారు. ప్రధానమంత్రి మోదీ, బీజేపీ ఈ దేశంలోని అన్ని వ్యవస్థలను తమ అధీనంలోకి తీసుకుంటున్నాయని ఆరోపించారు. కొద్ది మంది వ్యాపారవేత్తలకు అనుకూలంగా వ్యవహరించడం దేశ ఆర్థిక పతనానికి కారణమవుతోందని విమర్శించారు. కాంగ్రెస్ కేవలం ఓ రాజకీయ పార్టీ మాత్రమే కాదని, అన్ని మతాలు, కులాలు ,జెండర్ ప్రజల వాణిని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.