ఆజాదీ కా అమృత్ మహాత్సవ్‌లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం సూపర్ హిట్ అయింది. ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాతో సెల్ఫీ దిగి దాదాపు 6 కోట్ల మంది www.harghartiranga.com వెబ్ సైట్‌లో అప్ లోడ్ చేశారు. మువ్వన్నెలతో సెల్ఫీలు తీసుకున్న వారు తమ ఫొటోలను వెబ్ సైట్లో ఇంకా అప్ లోడ్ చేస్తున్నారు. జాతీయ భావనను పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదో అద్భుత విజయమని కేంద్రం పేర్కొంది. ఈ ఘటన దేశ చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోతుందని కేంద్రం ప్రకటించింది.
హర్ ఘర్ తిరంగా కార్యక్రమం విజయవంతం కావడంపై కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘‘హర్ ఘర్ తిరంగా’కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు యావద్భారతం ఏకతాటిపైకి వచ్చిందని, భారతదేశంలోని వివిధ వర్గాల ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ఆయన చెప్పారు. భారతదేశాన్ని ఉన్నతమైన స్థానంలో నిలపాలన్న ప్రజల వజ్ర సంకల్పానికి ఇది నిదర్శనమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Thank you, India –
For furthering the clarion call of Hon Prime Minister Shri @NarendraModi ji to join the ‘#HarGharTiranga' movement and for the more than 5 Crore selfies with the Tiranga. It reflects our will to keep India at the top as the Supreme Nation.#AmritMahotsav
1/2 pic.twitter.com/h2cnODL3nk— G Kishan Reddy (@kishanreddybjp) August 15, 2022