నీతి ఆయోగ్ నిరర్థక వ్యవస్థ అని తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించారు. ప్రధాని మోదీ భజన మండలిగా మారిందన్న కేసీఆర్ మండిపడ్డారు. తాజాగా… తెలంగాణ మంత్రి హరీశ్ రావు కూడా నీతి ఆయోగ్ పై విమర్శలు చేశారు. నీతి ఆయోగ్ అనే వ్యవస్థ రాజకీయ రంగు పులుముకుందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ చేసిన విమర్శలకు నీతి ఆయోగ్ సమాధానం ఇవ్వకుండా… తప్పుడు ప్రకటన చేసిందంటూ మండిపడ్డారు.
వాస్తవాలను దప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. థకాల అమలుకోసం నీతిఆయోగ్ చెప్పినా కేంద్రం నిధులుమంజూరు చేయలేదని, ఇప్పుడేమో నిధులు ఇచ్చినా వాడుకోలేదని నీతిఆయోగ్ చెబుతోందని మండిపడ్డారు. రూ.24వేల కోట్లు ఇవ్వాలని అడిగతే పైసా విదల్చలేదని ఫైర్ అయ్యారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందని ఆరోపించారు. ప్రగతి పథంలో దూసుకెళ్తున్న తెలంగాణపై ద్వేషం ఎందుకు..? అంటూ హరీశ్ రావు ప్రశ్నించారు.