రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆదివారం భేటీ అయ్యారు. విజయవాడలోని రాజ్‌భవన్‌కు చేరుకున్న బండారు దత్తాత్రేయకు రాజ్‌భవన్ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు సమకాలీన రాజకీయ అంశాలపై కొద్దిసేపు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయను విశ్వభూషణ్ హరిచందన్ సత్కరించారు. ఆ తర్వాత హర్యానా గవర్నర్ దత్తాత్రేయ గుంటూరు వెళ్లారు. గుంటూరు రైలుపేటలోని బీజేపీ నేత జూపూడి రంగరాజు నివాసానికి వెళ్లి, రంగరాజు తల్లి హైమావతిని పరామర్శించి, వారి కుటుంబ సభ్యులతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మరోవైపు గుంటూరు జిల్లా మంగళగిరి శివాలయం అభయహస్త పరమశివుడిని దత్తాత్రేయ దర్శించుకున్నారు.