అలహాబాద్ హైకోర్టు భారీ ప్రక్షాళనే చేపట్టింది. ఏకంగా 619 మంది జడ్జీలు, అధికారులను బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ బదిలీలో జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ లో సర్వే చేయండని సంచలన ఆదేశాలిచ్చిన జడ్జీ కూడా వున్నారు. యూపీలోని పలు ప్రాంతాల్లో ఈ 619 మంది జూడీషియల్ అధికారులు విధుల్లో వున్నారు. ఈ బదిలీల ద్వారా తమకు బదిలీ చేసిన ప్రాంతాలకు వెళ్లిపోనున్నారు.
ఈ మేరకు అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పేరు మీద ఉత్తర్వులు వెలువడ్డాయి. జూలై 4 కల్లా బదిలీ అయిన వారందరూ తమకు బదిలీ చేసిన ప్రాంతాలకు వెళ్లి, అధికారిక కార్యకలాపాలు చేపట్టాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఇక బదిలీ అయిన వారిలో 213 మంది సివిల్ జడ్జీలు, 285 మంది అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జీలు, 121 మంది సివిల్ జడ్జీలు వున్నారు.