ప్రముఖ నటుడు చియాన్ విక్రమ్ కు తీవ్ర గుండెపోటు వచ్చింది. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయన కుటుంబ సభ్యులు విక్రమ్ ను చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోందని, కంగారు పడాల్సిన అవసరమే లేదని ఆస్పత్రి సిబ్బంది పేర్కొంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే వుందన్నారు.
పొన్నియిన్ సెల్వన్ టీజర్ లాంచ్ కి విక్రమ్ హాజరు కావాలి. కానీ.. ఆయనకు గుండె పోటు రావడంతో కేన్సిల్ అయ్యింది. ఆయనకు గుండెపోటు రావడంతో చియాన్ విక్రమ్ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు ప్రకటించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.