ముంబైలో భారీ వర్షాలు కురుస్తుండగా నేడు వీధుల్లో నీరు నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందిపడ్డారు. ముంబైతో పాటు సమీప జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ దళాలు అప్రమత్తంగా ఉండాలని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ఆదేశించారు. సియాన్, అంధేరిలో రోడ్డుపై మోకాళ్ల లోతు నీళ్లు చేరుకున్నాయి. కొన్ని రూట్లలో రైళ్లు, బస్సు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న రైల్వే ట్రాక్‌లపై వరద నీరు చేరుతోంది. ముంబైలో స్వల్ప స్థాయి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు భారతీయ వాతావరణ శాఖ తెలిపింది.
