తెలంగాణలో రెండు రోజులుగా ఓ మోస్తారు వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ తో పాటు నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లిలో వర్షాలు పడుతున్నాయి. ఇక… నిజామాబాద్, సిరిసిల్ల, ఖమ్మం, వరంగల్, హనుమకొండలో కూడా వర్షాలు పడే ఛాన్స్ వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నల్లగొండ, సూర్యాపేట, జనగామ, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడతాయని, ఎల్లో అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఇక.. వర్షాల కారణంగా సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని అధికారులు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల వర్షాలు పడుతున్నాయి. మరోవైపు ఏపీలో కూడా భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
