కువైట్ విమానాశ్రయం ప్రయాణికులతో నిండిపోయింది. 2 రోజులుగా కువైట్ విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిపోయిందని విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు. వేసవి సెలవులు ముగియడం, విద్యా సంవత్సరం కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో విదేశాలకు వెళ్లిన ప్రవాసులు తిరిగి కువైట్ కు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో రద్దీ పెరిగిందని అధికారులు వివరించారు. కేవలం 2 రోజుల్లోనే కువైట్ విమానాశ్రయానికి విదేశాల నుంచి 340 కి పైగా విమానాలు వచ్చాయి. ఈజిప్ట్, సౌదీ అరేబియా, టర్కీ, దుబాయ్ నుంచి ఎక్కువ విమానాలు వచ్చాయి. ఇక… రోజుకు 30 వేల మంది ప్రయాణికులు కువైట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. మరో 3 రోజుల్లో సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు ప్రకటించారు.