తాము పాడిన పాటల కంటే పనికిమాలిన, అప్రస్తుత సమాచారమే ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని టాలీవుడ్ సింగర్స్ జోడీ హేమచంద్ర, శ్రావణ భార్గవి ఫైర్ అయ్యారు. హేమచంద్ర, శ్రావణ భార్గవి విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సింగర్ జోడీ వివరణ ఇచ్చింది. ఇన్ స్టా వేదికగా తాజాగా పోస్టులు పెట్టారు. తాము విడిపోతున్నామంటూ వస్తున్న వార్తలన్నీ అబద్ధాలేనని ప్రకటించారు.
నా సోలో పాటల కంటే ఇలాంటి అనవసర, అప్రస్తుత, పనికిరాని సమాచారం ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. గడిచిన కొన్ని రోజుల నుంచి నా యూట్యూబ్ ఛానల్ వ్యూస్, ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరిగారు. సాధారణం కంటే ఇప్పుడే ఎక్కువ పెరిగారు. వర్క్, సంపాదన లభిస్తోంది. తప్పో, ఒప్పో కానీ.. మీడియా నాకో వరం.. అంటూ శ్రావణ భార్గవి రాసుకొచ్చింది. దీనిని తన భర్త హేమచంద్రకు ట్యాగ్ చేసింది. ఎవరైతే తమ సమయాన్ని వృథా చేసుకోవాలనుకుంటున్నారో, తమ తెలివితక్కువ తనాన్ని బయటపెట్టాలి అనుకుంటున్నారో వారికోసమే ఈ పోస్టు అంటూ తెలిపాడు.