కోలివుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి సుబ్రహ్మణ్యం (84) కన్నుమూవారు. కొంత కాలంగా ఆయన వయస్సురీత్యా వచ్చే అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. చికిత్స కూడా తీసుకుంటున్నారు. చికిత్స కొనసాగుతుండగానే.. శుక్రవారం ఉదయం ఆయన కన్నుమూశారు. దీంతో ఇండస్ట్రీ ప్రముఖులు, అజిత్ అభిమానులు ఆయనకు నివాులు అర్పిస్తున్నారు.
అయితే.. అజిత్ ప్రస్తుతం భార్య షాలిని, పిల్లలతో యూరోప్ టూర్‌లో ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన అక్కడి నుంచి బయలుదేరారు.నేడు చెన్నైలోని బెసంత్ నాగ శ్మశాన వాటికలో సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సుబ్రహ్మణ్యం స్వస్థలం కేరళలోని పాలక్కాడ్. ఆయన కోల్‌కతాకు చెందిన మోహినీ (సింధి ఫ్యామిలీ)ని పెళ్లి చేసుకున్నారు. సుబ్రహ్మణ్యంకు ముగ్గురు కుమారులు కాగా.. అజిత్‌కుమార్ రెండోకుమారుడు. సుబ్రహ్మణ్యం మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.