అక్కినేని తొక్కినేని అంటూ అక్కినేని నాగేశ్వర రావును కించపరుస్తూ నటుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై హీరో నాగచైతన్య, అఖిల్ ఘాటుగా స్పందించారు. నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వర రావు గారు, ఎస్వీ రంగా రావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలంటూ ట్వీట్ చేశారు. వారిని అగౌరపరచటం అంటే మనల్ని మనం కించపరుచుకోవడమే అని ట్వీట్ చేశారు. వీరసింహా రెడ్డి సినిమా సక్సెస్ మీట్ లో బాలయ్య పై వ్యాఖ్యలు చేశారు. సినిమా షూటింగ్ సమయంలో నటుల మధ్య ఎలాంటి అంశాలు చర్చకు వచ్చేవో చెప్పారు. అందరూ అద్భుతంగా నటించారు. నాకు మంచి టైంపాస్. నాన్నగారు, డైలాగులు, ఆ రంగారావు గారు, ఈ అక్కినేని, తొక్కినేని అన్ని మాట్లాడుకునే వారం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
— chaitanya akkineni (@chay_akkineni) January 24, 2023