హీరో రామ్, హీరోయిన్ జెనీలియా జంటగా నటించిన కామెడీ చిత్రం రెడీ.. చంద్రమోహన్, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాస రావు, జయప్రకాశ్ రెడ్డి, ధర్మవరపు, సునీల్, బ్రహ్మానందం.. ఇలా.. అందరూ అద్భుతమైన కామెడీని పంచారు. అటు లవ్ స్టోరీ, ఇటు కామెడీ సీన్స్ కలిపి అద్భుతంగా పండించారు. ఈ సినిమా వచ్చి జూన్ 19 కి సరిగ్గా 14 సంవత్సరాలు నిండాయి. 2008 లో ఈ సినిమా విడుదలై… ప్రేక్షకులందర్నీ విశేషంగా ఆకట్టుకుంది.
ఒకమ్మాయి బదులు హీరోయిన్ జెనీలియాను పెళ్లి మంటపం నుంచి తీసుకెళ్తారు. ఈ విషయం జెనీలియా కుటుంబీకులకు తెలుస్తుంది. ఆ తర్వాత రామ్ తదితరులను ఛేజ్ చేస్తారు. అడవుల గుండా ప్రయాణం సాగుతున్న క్రమంలో రామ్ తన పేరును దానయ్యగా జెనీలియాకు చెబుతాడు. అప్పటి నుంచి రామ్ ను దానయ్య అంటూ వెక్కిరిస్తుంది. మధ్యలో వారికి ధర్మవరపు సుబ్రహ్మణ్యం తగులుకుంటాడు. ఆ తర్వాత రామ్, జెనీలియా మధ్య లవ్ స్టోరీ కొనసాగుతుంది. జెనీలియా కుటుంబాన్ని, తన కుటుంబాన్ని కలిపి, తన లవ్ ను సక్సెస్ చేసుకోవడానికి రామ్ పడుతున్న తంటాలు, కోటా శ్రీనివాస రావు, జయ్ ప్రకాశ్ రెడ్గి కామెడీలు అందర్నీ భలే నవ్విస్తాయి. చివరగా… ఈ రెండు కుటుంబాలు కలిసి, రామ్, జెనీలియా పెళ్లి అవుతుంది. దీంతో సినిమా ముగుస్తుంది.
అయితే.. 14 ఏళ్లు నిండిన సందర్భంగా హీరో రామ్ ఓ ట్వీట్ చేశారు. ఈ సినిమాను తాను బాగా ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చాడు. స్క్ర్రిప్ట్ రాయడం మొదలు రిలీజ్ వరకూ రెడీ సినిమాను బాగా ఎంజాయ్ చేశానని ట్విట్టర్ లో అన్నాడు. హీరోయిన్ జెనీలియాకు, ప్రొడ్యూసర్ రవి కిశోర్ కు హీరో రామ్ ధన్యవాదాలు ప్రకటించారు. ఈ సందర్బంగా ఆనాటి ఫొటోలను షేర్ చేశాడు.
https://twitter.com/SreenuVaitla/status/1538415394297241600?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1538415394297241600%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.v6velugu.com%2F-14-years-for-ready-cinema