మరో కొత్త సినిమాతో హీరో సుమంత్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సంతోశ్ జాగర్లపూడి దర్శకత్వంలో చేసేందుకు సుమంత్ ఓకే చెప్పేశాడట. సుబ్రహ్మణ్యపురం సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ఇది రెండో సినిమా అవుతుంది. కె. ప్రదీప్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
పురాతన దేవాలయం నేపథ్యంలో ఈ కథ సాగుతుందట. అయితే.. థ్రిల్ మాత్రం విపరీతంగా వుంటుందన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభమైందని, త్వరలో చిత్రీకరణ కూడా మొదలుకానుంది. అయితే నటీ నటులు.. ఇతరత్రా విషయాలు అతి త్వరలోనే బయటకు రానున్నారు.