ఏపీ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి విశాల్ వస్తున్నారని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఏకంగా కుప్పం వేదికగా మాజీ సీఎం చంద్రబాబుపైనే పోటీకి దిగుతున్నారని కూడా బాగా ప్రచారం జరిగింది. వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారని, ఇప్పటికే మంతనాలు కూడా జరిగాయని పుకార్లు వచ్చాయి. వీటన్నింటిపై హీరో విశాల్ ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. అవన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు.
తాను కుప్పం నుంచి బరిలోకి దిగుతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. వాటన్నింటినీ ఖండిస్తున్నా. రాజకీయాలకు సంబంధించి మాత్రం నన్ను ఎవ్వరూ ఇప్పటి వరకూ కలవలేదు. ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. సినిమాల్లో బిజీ బిజీగా వున్నా. ఏపీ రాజకీయాల్లోకి రావాలని ఉద్దేశం లేదు. చంద్రబాబుపై పోటీ చేసే ఉద్దేశమూ లేదు అని హీరో విశాల్ ప్రకటించారు.
https://twitter.com/VishalKOfficial/status/1542851495879532546?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1542851495879532546%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fntvtelugu.com%2Fmovie-news%2Fvishal-gave-clarity-about-his-political-entry-rumors-190089.html