ఎప్పుడూ పోరాట సన్నివేశాలకు హీరో విశాల్ ముందుంటాడు. అత్యంత సహజంగా నటిస్తూ.. ప్రేక్షకులకు చేరువ కావాలన్నది ఆయన స్టైల్. ఇలా సహజ నటనకు దగ్గరగా జీవించాలన్న లక్ష్యంతో ఆయనకు పలు మార్లు షూటింగ్ సమయంలో ప్రమాదాలు కూడా జరిగాయి. తాజాగా.. ఓ సినిమా షూటింగ్ లో హీరో విశాల్ కు తీవ్రంగా గాయాలయ్యాయి. హీరో విశాల్ తాజా నటిస్తున్న చిత్రం లాఠీ. ఈ సినిమా ఫైట్ సీన్స్ చేస్తుండగా… ఈ ప్రమాదం జరిగింది. విశాల్ కాలికి బలమైన గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో లాఠీ సినిమా షూటింగ్ ఆగిపోయింది. విశాల్ తొందరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
