Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ప్రేమలో పడ్డా… త్వరలోనే అమ్మాయిని పరిచయం కూడా చేస్తా : విశాల్

స్టార్ హీరో విశాల్ ప్రేమలో పడ్డాడు. ఈ విషయాన్ని విశాల్ స్వయంగా ప్రటకించాడు. పెద్దలు కుదిర్చిన వివాహం మనకి సెట్ కాదన్నాడు. తనకు ప్రేమ పెళ్లే చేసుకోవాలని ఉందని, ఓ అమ్మాయితో ప్రేమలో వున్నానని ప్రకటించాడు. ఆ అమ్మాయి ఎవరో త్వరలోనే మీ అందరికీ చెబుతా. ఆ అమ్మాయిని పరిచయం చేస్తా అని విశాల్ ప్రకటించాడు. ఈ ప్రకటనతో విశాల్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో తెలుగు నటితో విశాల్ కు నిశ్చితార్థమైన విషయం తెలిసిందే. అనీషా రెడ్డిని ప్రేమించి, కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. అయితే.. అనుకోని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. ఈ క్రమంలోనే మళ్లీ ప్రేమలో పడ్డాడు విశాల్.

Related Posts

Latest News Updates