హీరోయిన్ కాజల్ అగర్వాల్ బాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్ చేసింది. హిందీ పరిశ్రమలో అసలు క్రమశిక్షణ, నైతిక విలువలు కనిపించవంటూ మండిపడ్డారు. తాను పుట్టి పెరిగింది ముంబైలో అయినా… కెరీర్ మాత్రం హైదరాబాద్ లోనే ప్రారంభమైందని తెలిపింది. హిందీ మదర్ టంగ్ అయినా… తెలుగు, తమిళ చిత్రాల్లోనే నటించానని, హైదరాబాద్, చెన్నై నగరాలను తన నివాసంగానే భావిస్తానని స్పష్టం చేసింది.
ఇక.. సౌత్ ఇండస్ట్రీలో ఫ్రెండ్లీ వాతావరణం వుంటుందని, అందుకే అద్భుతమైన టెక్నీషియన్లు, దర్శకులు వున్నారని చెప్పుకొచ్చింది. ”నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు పోస్ట్ చేసిన ఫొటోలను చూసి లావుగా ఉన్నానంటూ కొందరు కామెంట్స్ విసిరారు. బాడీ షేమింగ్‌కు గురయ్యాను. కానీ వాటిని పట్టించుకోలేదు. ఒక వైపు నటిగా, మరో వైపు తల్లిగా కొనసాగటం అనేది చాలా కష్టమైన పని. నా కొడుకు చాలా చిన్నవాడు. వాటిని వదిలేసి వర్క్‌కి వెళుతుంటే గుండె బద్దలవుతుంటుంది. కానీ నేను చేసే పనిని ప్రేమిస్తున్నాను.” అని కాజల్ అగర్వాల్ పేర్కొంది. ప్రస్తుతం కాజల్ ఇండియన్ 2 సినిమాతో పాటు నందమూరి బాలకృష్ణ హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న NBK 108లోనూ హీరోయిన్‌గా నటిస్తోంది.