మిల్కీ బ్యూటీ తమన్నా హీరో ప్రభాస్ పై ప్రశంసలు కురిపించింది. అసలైన కింగ్ ప్రభాస్ అంటూ ప్రశంసించింది. అసలు ప్రభాస్ డబ్బు గురించి ఆలోచించే వ్యక్తి కాదని.. అసలు ఒక రాజు ఎలాం ఉంటాడో ప్రభాస్ ను చూస్తే తెలుస్తుందంటూ పొగడ్తలతో ముంచెత్తింది. అతడు అంత పెద్ద స్టార్ అయినా చాలా సింపుల్ గా ఉంటాడు. ప్రభాస్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. అతను తన ఇంటికి వచ్చిన గెస్టులను ఎలా చూసుకుంటారో అందరికీ తెలుసు. ఆయన భోజనానికి పిలిస్తే కనీసం 30 రకాల వంటలు ఉంటాయి. ప్రభాస్ ఆతిథ్యం మరిచిపోలేనిది. అంటూ తెగ పొగిడింది. తాజాగా తమన్నా ఓ ఇంటర్వూలో ప్రభాస్ ఆతిథ్యం గురించి మాట్లాడుతూ..
ప్రభాస్‌కు చాలా మంది అభిమానులున్నారని, అతను తన ఇంటికి వచ్చిన అతిథులను ఎలా చూసుకుంటారో దేశమంతా తెలుసని పేర్కొంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను ఇండస్ట్రీలో చాలా మంది సింపుల్ మ్యాన్ అని అంటుంటారు. అంతేకాకుండా ఆతిథ్యం ఇవ్వడంలో ఆయనకు మించినోళ్లు లేరని అంటుంటారు. షూటింగ్‌లో ఉన్నప్పుడు తనతో నటించే నటీనటులకు ప్రభాస్ ఇంటి నుంచి రకరకాల రుచికరమైన వంటకాలు తెప్పిస్తారని కూడా ప్రచారం వుంది. అంతెందుకు… క్రిష్ణంరాజు మరణించిన తర్వాత… పుట్టెడు దు:ఖంలో వున్నా…. ఇంటికి వచ్చిన అభిమానులకు పసందైన విందు ఇచ్చి మరీ సాగనంపారని చెప్పుకుంటారు. ఇప్పటికే.. ప్రభాస్ ఆతిథ్యంపై చాలా మంది ప్రశంసించారు. తాజాగా తమన్నా కూడా ప్రశంసించింది.