ఏపీ రాజకీయాలు ప్రస్తుతం అయ్యన్నపాత్రుడి ఇంటి చుట్టూనే తిరుగుతున్నాయి. పంట కాల్వను ఆక్రమించి గోడ నిర్మించారని పురపాలక సిబ్బంది అర్ధరాత్రి జేసీబీలతో ఆయన ఇంటి గోడను కూల్చేశారు. ప్రభుత్వ భూమిలోని రెండు సెంట్లు ఆక్రమించారని నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ తన నోటీసులో పేర్కొన్నారు.
ఇప్పుడు ఇదే పెద్ద వివాదంగా మారిపోయింది. నోటీసు ఇచ్చిన వెంటనే గోడ తొలగించడంపై అయ్యన్న కుటుంబీకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొద్ది సేపు గోడ కూల్చే పనులను అయ్యన్న కుటుంబీకులు అడ్డుకున్నారు. ఇక.. ఇప్పటికే అయ్యన్నపై 12 కు పైగా కేసులు నమోదయ్యాయి.
ఇప్పుడు అయ్యన్న పాత్రుడిని పోలీసులు అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాలు ఒక్కసారిగా బయల్దేరాయి. ఆయన ఇంటిని ప్రత్యేక బలగాలు చుట్టుముట్టాయి. ఏ క్షణంలోనైనా అయ్యన్నను అరెస్ట్ చేయవచ్చని తెలుస్తోంది.