కేంద్రం యువకులకు భారత ఆర్మీలో అవకాశం కోసం కొత్తగా అగ్నిపథ్ పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పథకంతో అనేక లాభాలు వున్నాయని, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో యువత చిక్కుకోవద్దని కేంద్ర మంత్రులు స్పష్టం చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే.. అగ్నిపథ్ లో చేరడానికి దేశంలోని యువత ఆసక్తి చూపుతున్న విషయం స్పష్టంగా ద్యోతకమవుతోంది.
ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఏమాత్రం పట్టించుకోకుండా ఈ స్కీంకు అప్లై చేస్తున్నారు. ఇప్పటి వరకూ అగ్నిపథ్ కు దేశ వ్యాప్తంగా 83 వేల మంది అప్లై చేసుకున్నారని ఆర్మీ ప్రకటించింది. దీనిని బట్టి చూస్తే మంచి ఆదరణ లభిస్తోందని అర్థమవుతోందని ఆర్మీ పేర్కొంది. జూన్ 24 న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైందని, కేవలం 6 రోజుల వ్యవధిలోనే లక్షా 83 వేల దరఖాస్తులు వచ్చాయని ఆర్మీ తెలియజేసింది.