Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది… ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తనను ఈ నెల 21న   అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. 2016 దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు ఒక శృంగార తారకు భారీ మొత్తంలో మనీ ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణల కేసులో తనను ఫెడరల్‌ పోలీస్‌ అధికారులు అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని చెప్పారు. కోటీశ్వరుడు జార్జ్‌ సొరొస్‌ ఆదేశాల మేరకే ఇదంతా జరుగుతున్నదని ఆరోపించారు. తనను అరెస్ట్‌ చేస్తే నిరసనలకు దిగాలని ట్రంప్‌ తన అభిమానులకు పిలుపునిచ్చారు. మాన్‌హట్టన్‌ డిస్ట్రిక్‌ అటార్నీ ఆఫీస్‌ నుంచి లీక్‌ వచ్చిందని ఆరోపిస్తూ  ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్‌ రాసుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో లీడింగ్‌ రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడిని వచ్చేవారం మంగళవారం అరెస్ట్‌ చేయొచ్చు. దీనికి వ్యతిరేకంగా నిరసన తెలుపండి  అని పిలుపునిచ్చారు.

Related Posts

Latest News Updates