యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం నేను మీకు బాగా కావాల్సినవాడిని ఒకటి. శ్రీధర్ గాదె దర్శకత్వం వహిస్తున్నారు. కిరణ్‌కు జోడీగా సంజనా ఆనంద్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని కోడీ రామకృష్ణ సమర్పణలో కోడి దివ్య, దీప్తి నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచింది. తాజాగా మేకర్స్ మరో అప్‌డేట్‌ని ప్రకటించారు. ఈ చిత్రంలోని నచ్చావ్ అబ్బాయ్ అంటూ సాగే పెప్పి సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. భాస్కరభట్ల రచించిన ఈ గీతాన్ని ధనుంజయ, లిప్సిక ఆలపించారు. మణిశర్మ స్వరపరిచిన ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సెప్టెబర్ 9న విడుదల కానుంది.