ఉక్రెయిన్‌పై అణ్వాయుధ దాడి చేయకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్‌ను చైనా, భారత్‌లు ఆపి ఉండొచ్చునని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ భారత్, చైనాలు అడ్డుపడి ఉండకపోతే బహుశా యుద్ధాన్ని ముగించేయడానికి రష్యా అణ్వాయుధాలు ప్రయోగించి ఉండేదన్నారు. భారత్, చైనాలు అడ్డుపడి ఉండకపోతే వ్లాదిమీర్ పుతిన్ మరింత రెచ్చిపోయి ఉండేవాడని అన్నారు. రష్యాను నివారించమని మేము కోరాము. ఆ విషయంలో కొంత విజయం సాధించామనే అనుకుంటున్నాము. భారత్, చైనాలు రష్యాను నివారించాయి. భారత్, చైనాల ప్రభావం కొంత మేరకు పనిచేసిందనే అనుకుంటున్నాము అని ఆయన వివరించారు. భారత్‌తో రష్యాకు దశాబ్దాలుగా స్నేహ సంబంధాలున్నాయి, అయితే ఇప్పుడు అమెరికాతో, ఫ్రాన్స్‌తో కూడా భారత్ స్నేహసంబంధాలను వృద్ధి చేసుకుంది అన్నారు.
