కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విమానాల్లో కరోనా మార్గదర్శకలు కఠినంగా అమలు చేయాలని అన్ని విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికులందరూ విమానాల్లో తప్పకుండా మాస్కులు ధరించేలా చూడాలని కోరంది. ఒకవేళ ప్రయాణికుల్లో ఎవరైనా ఆదేశాలను ఉల్లంఘిస్తే విమానం నుంచి దించేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. తప్పనిసరి, అత్యవసర పరిస్థితుల్లోనే మాస్క్ తీసేందుకు అనుమతించాలని విమానయాన సంస్థలను ఆదేశించింది. నిబంధనలు అమలు చేస్తున్నారా లేదా అనేదానిపై తనిఖీలు చేపడుతామని పేర్కొన్నది. ప్రయాణికులు కరోనా మార్గదక్శకాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. విమానాశ్రయాల్లో నిఘా పెంచాలని, ఎవరైనా మాస్క్ పెట్టకోకుండా కనబడితే వారికి అనుమతి నిరాకరించాలని సూచించింది. విమానాశ్రయంలోని పలుచోట్ల శానిటైజర్లను ఉంచాలని ఆదేశించింది.
