విప్లవ రచయిత వరవరావుకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన మెడికల్ బెయిల్ మంజూరు చేసింది. కంటి చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లడానికి అనుమతి ఇవ్వాలంటూ వరవరావు సుప్రీంకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. హైదరాబాద్‌కు వెళ్లాంటే అనుమతి కోసం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కోర్టును అభ్యర్థించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ సందర్భంగా వరవరరావు తరపు న్యాయవాది ఆనంద్ గ్రోవర్ వాదనలు వినిపించారు. సొంత నివాస స్థలమైన హైదరాబాద్‌లో చికిత్స చేయించుకుంటే ఆ వాతావరణంలో వరవరరావు త్వరగా కోలుకుంటారని తెలిపారు. దీంతో అనుమతి కోసం ఎన్‌ఐఏ ట్రయల్ కోర్టుకు వెళ్లాలని వరవరారావుకు సుప్రీంకోర్టు సూచించింది.
