గుజరాత్ పోర్ బందర్ తీరంలోని అరేబియా సముద్ర జలాల్లోకి పాక్ యుద్ధ నౌక ఆలంగీర్ చొచ్చుకొచ్చింది. భారత్, పాక్ మధ్య సరిహద్దుగా వున్న సముద్ర జలాలను దాటి… పాక్ యుద్ధ నౌక భారత జలాల్లోకి చొచ్చుకొచ్చింది. దీంతో అలర్ట్ అయిన భారత కోస్ట్ గార్డ్స్ దళం కమాండ్ సెంటర్ కు సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత పాక్ యుద్ధనౌక ఆలంగీర్ ను ఇండియన్ కోస్ట్ గార్డ్ర్స్ తరమికొట్టింది. పలు మార్లు తాము హెచ్చరికలు చేశామని, వారి జలాల్లోకి వెళ్లిపోవాలని వార్నింగ్ కూడా ఇచ్చామని, అయినా.. పాక్ స్పందించలేదని ఇండియన్ కోస్ట్ గార్డ్స్ పేర్కొంది. ఆ తర్వాత కాసేపటికి పాక్ యుద్ధ నౌక వెను తిరిగిందని అధికారులు పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో గుజరాత్ తీరంలో పాకిస్తాన్ నార్కో టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తోంది. దీంతో భారత సైనికులు ఆపరేషన్ ఐలాండ్ వాచ్ నిర్వహిస్తోంది.