దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ కీలక ప్రకటన జారీ చేసింది. ఈ నెల 26 న పాస్ పోర్ట్ సర్వీస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. దుబాయ్ తో పాటు నార్తర్న్ ఎమిరేట్స్ లోని 12 బీఎల్ ఎన్ ఇంటర్నేషనల్ సర్వీస్ లిమిటెడ్ సెంటర్ లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ అందుబాటులో వుంటుందని పేర్కొంది.
ప్రవాసులు తమ తమ పాస్ పోర్టు, దాని సంబంధమైన సమస్యలను ఈ శిబిరంలో పరిష్కరించుకోవాలని ఇండియన్ కాన్సులేట్ కోరింది. ప్రవాస భారతీయుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొనే… ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అయితే ఈ శిబిరానికి దరఖాస్తు దారులు ముందుగానే బీఎల్ ఎస్ వెబ్ సైట్ ద్వారా అపాయింట్ మెంట్ తీసుకోవాలి. అందులో పేర్కొన్న సమయానికి బీఎల్ ఎస్ సెంటర్ కు వెళ్లి.. దరఖాస్తు సమర్పించుకోవాలి. అయితే ఈ సమయంలో వారికి సంబంధించిన ధ్రువపత్రాలను కూడా సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు.