ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ రిక్కీ కేజ్ కు మూడోసారి గ్రామీ అవార్డు దక్కింది. తన లేటెస్ట్ ఆల్బమ్ డివైన్ టైడ్స్ కు ఈ అవార్డ్ లభించింది. ప్రతిష్టాత్మకమైన గ్రామీ అవార్డ్ కోసం ప్రపంచ నలుమూలల నుంచి వందలమంది మ్యూజిక్ కంపోజర్స్ నామినేట్ అవుతారు. అందులో బెస్ట్ ఇమ్మర్సివ్ ఆడియో ఆల్బమ్ విభాగంలో రిక్కీ ఈ అవార్డు గెలుచుకున్నాడు. ఈ ఆల్బమ్ లో 9 పాటలు, 8 మ్యూజిక్ వీడియోలు ఉన్నాయి. మన దేశం తరుపున గ్రామీ అవార్డు గెలుచుకున్న అతిపిన్న వయస్కుడిగా, 4వ భారతీయుడిగా విక్కీ రికార్డు నెలకొల్పాడు. ఈ పురస్కారాన్ని డివైన్ టైడ్స్ కి పనిచేసిన డ్రమ్మర్ స్టీవార్ట్ కోప్ ల్యాండ్ తో షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా రిక్కీ ట్వీట్ చేశాడు. మూడో గ్రామీ అవార్డు గెలిచినందుకు చాలా సంతోషంగా వుందన్నారు. తనకు మాటలు రావడం లేదని, ఈ పురస్కారాన్ని భారత్ కి అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు. ఈ సందర్భంగా నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు.
