షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానం కరాచీ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం వల్లే ఎమర్జెన్సీగా ల్యాండ్ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. సాంకేతిక సమస్యల కారణంగా అందులో వున్న ప్రయాణికుల్ని ఇండిగో సంస్థ మరో విమానంలో తరలించింది. షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానం 6E1406 ను కరాచీ వైపు మళ్లించి, అక్కడ ల్యాండ్ చేశామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అక్కడే ఆ విమానానికి తనిఖీలు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో భారత్ కు చెందిన రెండు విమానాలు కరాచీలో అత్యవసరంగా ల్యాండ్ కావడం గమనార్హమే.
