అత్యంత పవిత్రమైన ఇంద్రకీలాద్రిపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంద్రకీలాద్రిని పొగాకు నిషేధిత ప్రాంతంగా (నో టోబాకో జోన్) ప్రకటించింది. ఈ నెల 26 నుంచి ఆలయ పరిసర ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తుల నిషేధిత చట్టం వర్తిస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ప్రకటించారు.
ఉద్యోగులతో సహా ఎవరైనా ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే 20 నుంచి 200 రూపాయల వరకూ ఫైన్ వేస్తామని హెచ్చరించారు. నేషనల్ టొబాకో కంట్రోల్, కోట్పా 2003 చట్టంలో భాగంగా ఆలయ పరిసరాల్లో పొగాకు ఉత్పత్తులను నిషేధించామని కలెక్టర్ వివరించారు. దుర్గ గుడి దగ్గర అధికారులు, ఆరోగ్య శాఖ అధికారుల నిరంతర పర్యవేక్షణ వుంటుందని కలెక్టర్ ఢిల్లీరావు ప్రకటించారు.