ఇంటర్మీడియట్ ఫలితాలను తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 63.32 శాతం, సెకండ్ ఇయర్ లో 67.16 శాతం పాస్ అయ్యారని వెల్లడించారు. అయితే ఈ ఫలితాల్లో అమ్మాయిలదే హవా కొనసాగింది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో మొత్తం 4,64,892 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 2,94,378 పాసయ్యారు. బాలికలు 72.33 శాతం, బాలురు 54.25 శాతం పాసయ్యారు. సెకండియర్ లో మొత్తం 4,42,895 మంది పరీక్షలు రాయగా, 2,97,458 మంది పాసయ్యారు. ఇందులో బాలికలు 75.33 వాతం, 59.21 శాతం బాలురు పాసయ్యారు.
ఇక.. ఫస్ట్ ఇయర్ లో అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో పాసయ్యారు. 76 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. అత్యల్పంగా మెదక్ జిల్లాలో. కేవలం 40 శాతమే పాసయ్యారు. ఇక.. ద్వితీయ సంవత్సరంలో మేడ్చల్ జిల్లాలో 78 శాతం పాసవ్వగా.. అత్యల్పంగా మెదక్ లో 47 శాతం మాత్రమే పాసయ్యారు. ఇక… ఆగస్ట్ 1 నుంచి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ వుంటాయని అధికారులు ప్రకటించారు. ఈ నెల 30 నుంచే సప్లిమెంటరీ ఎగ్జామ్స్, రీ కౌంటింగ్ ఫీజులు కట్టుకోవచ్ని ప్రకటించారు.