మణిపూర్ లో 5 రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే చురాచందపూర్, విష్ణుపూర్ లో 2 నెలల పాటు 144 సెక్షన్ అమలులో వుంటుందని రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బిష్ణుపూర్ లో ఓ వ్యాన్ ను కొంత మంది యువకులు తగలబెట్టడంతో ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే ద్వేషపూరిత ప్రసంగాలను ప్రసారం చేస్తున్నారని పోలీసులు కనిపెట్టారు. దీంతో వాటిని అరికట్టేందుకు 5 రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తున్నట్లు రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిూర్ లో జాతీయ రహదారుల దిగ్బంధనానికి పిలుపునిచ్చింది. మణిపూర్ అటానమస్ జిల్లా కౌన్సిల్ బిల్లు 2021 ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
Manipur | Section 144 CrPC imposed in the Churachandpur and Bishnupur districts for the next two months after 3-4 people torched a vehicle in Phougakchao Ikhang last evening. pic.twitter.com/WjY5mTOio4
— ANI (@ANI) August 7, 2022