తెలంగాణ ప్రభుత్వం ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీగా పనిచేస్తున్న సునీల్ దత్ ను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇక.. భద్రాచలం అసిస్టెంట్ సూపరింటెండెంట్ గా వున్న డాక్టర్ వినీత్ ను కొత్తగూడెం జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. గ్రేహౌండ్స్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న బిరుదురాజు రోహిత్ రాజు (2018 బ్యాచ్) ను భద్రాచలం అసిస్టెంట్ ఎస్పీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.