Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

బాలకృష్ణ ఆశీస్సులతో రెండో వారం కూడా దూసుకెళ్తున్న ‘ఐక్యూ’

సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో బాలకృష్ణ పుట్టినరోజు వేడుక!!

సాయి చరణ్‌, పల్లవి జంటగా నటించిన చిత్రం ‘ఐక్యూ’. ‘పవర్‌ ఆఫ్‌ ద స్టూడెంట్‌’ అన్నది ఉపశీర్షిక. జిఎల్‌బి శ్రీనివాస్‌ దర్శకత్వం కె.ఎల్‌.పి మూవీస్‌ పతాకంపై కాయగూరల లక్ష్మీపతి నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ  చిత్రం విజయవంతంగా రెండోవారం నడుస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్‌ మీట్‌లో కేక్‌ కట్‌ చేసి  బాలయ్య బర్త్‌డే సెలబ్రేట్‌ చేశారు.
అనంతరం నిర్మాత మాట్లాడుతూ ‘‘సరైన థియేటర్లు దొరుకుతాయా లేదా అన్న డైలామాలో ఉన్నాం. బాలకృష్ణగారు ట్రైలర్‌ విడుదల చేశాక మా సినిమా క్రేజ్‌ పెరిగింది. 99 థియేటర్లు దొరికాయి. సినిమా కథ జనాలకు బాగా కనెక్ట్‌ అయింది. రెండో వారం కూడా సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఇదంతా బాలకృష్ణగారి వల్లే సాఽధ్యమైంది. నందమూరి కుటుంబంతో సినిమా చేయాలనుకున్నా. తారకరత్నగారితో సినిమా అనుకున్నా. ఆయన మరణించడంతో కుదరలేదు. త్వరలో నందమూరి ఫ్యామిలీ హీరోలతో ఓ సినిమా చేస్తా. మా సినిమాకు సహకరించిన బాలకృష్ణ, ప్రసన్నకుమార్‌ అందరికీ కూడా కృతజ్ఞతలు. రెండో సినిమా  వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని అన్నారు.

ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ ‘‘చిన్న సినిమా సక్సెస్‌ అయితే ఇండస్ట్రీ బావుంటుంది. లక్ష్మీపతిలాంటి నిర్మాతలు వస్తారు. ఆయనకు సినిమా అంటే చాలా ఇష్టం. ఈ సినిమా సక్సెస్‌తో మరిన్ని సినిమాలు ప్లాన్‌ చేస్తున్నారు. రెండ్రోజులుగా బాలయ్య బర్త్‌డే సెలబ్రేషన్స్‌ జరుగుతున్నాయి. ఆయన ఈ సినిమాకు ఇచ్చిన సపోర్ట్‌ మరువలేనిది’’ అని అన్నారు. అనం
డిఓపి సురేందర్‌రెడ్డి, అనంతపురం జగన్‌, చిత్ర బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నటీనటులు
లేఖ ప్రజాపతి
ట్రాన్సీ
సుమన్‌
బెనర్జీ
సత్యప్రకాష్‌
పి.రఘునాథ్‌రెడ్డి
కె.లక్ష్మీపతి
సూర్య
గీతాసింగ్‌
షేకింగ్‌ శేష్‌
సత్తిపండు
సమీర్‌ దత్తా
సాంకేతిన నిపుణులు:
కెమెరా: టి.సురేందర్‌రెడ్డి
సంగీతం: పోలూర్‌ ఘటికాచలం
ఎడిటింగ్‌: శివ శర్వాణి
కో-డైరెక్టర్‌-కో రైటర్‌
దివాకర్‌ యడ్ల
పిఆర్వో: మధు వి.ఆర్‌
నిర్మాత: కాయగూరల లక్ష్మీపతి
దర్శకత్వం:  జిఎల్‌బి శ్రీనివాస్‌

Related Posts

Latest News Updates