కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే యువకులు డబ్బులను లంచంగా ఇవ్వాలని, వయసులో ఉన్న యువతులైతే పడుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నదని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) ప్రతినిధి ప్రియాంక్ ఖర్గే అన్నారు.. కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (కేపీటీసీఎల్)లో జరుగుతున్న నియామక ప్రక్రియలో అవినీతి జరుగుతున్నదని మండిపడ్డారు. సెక్స్ స్కాండల్లో ఇప్పటికే ఒక మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను దొడ్డిదారిన అమ్ముకుంటున్నారని, దీన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని ఆరోపించారు.
