అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ (73) కన్నుమూశారు. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. న్యూయార్క్ నగరంలోని తన నివాసంలో గుండెపోటుతో చనిపోయారు. ఈ విషయాన్ని వైద్యులు పేర్కొన్నారు. ట్రంప్ మాత్రం తన ట్వీట్ లో ఎక్కడా ఈ విషయాన్ని పేర్కొనలేదు. ఇవానా అద్భుతమైన మహిళ. ఆమె జీవితం స్ఫూర్తిమంతం. ముగ్గురు పిల్లలే లోకంగా ఆమె జీవించింది. వాళ్లను చూసే మురిసిపోయేది. ఆమె ఆత్మకు శాంతి కలగాలి అని ట్రంప్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
Ivana Trump, the first wife of former US President Donald Trump, has died in New York City.
“She was a wonderful, beautiful, and amazing woman, who led a great and inspirational life," former president Donald Trump posted on social media pic.twitter.com/bAoRr2iKFj
— ANI (@ANI) July 14, 2022
ఇక ఇవానా ట్రంప్ మరణంపై ఇవాంక ట్రంప్ కూడా స్పందించారు. మా అమ్మ అద్భుతమైన మహిళ. వ్యాపారంలో శక్తిమంతంగా పనిచేశారు. అద్భుతమైన అందం, తమ విషయంలో ఎంతో శ్రద్ధ గల తల్లి. ఆమె మరణ వార్త విని గుండె పగిలినంత పని అయ్యింది. సంపూర్ణ జీవితాన్ని అనుభవించింది. ఎప్పుడూ నవ్వుతూ వుండేది అంటూ ఇవాంక ట్వీట్ చేశారు. మరోవైపు ట్రంప్ తో విడాకుల తర్వాత ఇవానా ట్రంప్ రెండు సార్లు పెళ్లి చేసుకున్నారు. 1995 లో ఇటాలియన్ వ్యాపారవేత్త రికార్డో మజ్జుచెల్లి ఆమె భర్త. రెండు సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్నారు. 2008 లో మళ్లీ నటుడు, మోడల్ రూబికొండిని వివాహం చేసుకున్నారు. విడాకులు కూడా తీసుకున్నారు.
Heartbroken by the passing of my mother. Mom was brilliant, charming, passionate and wickedly funny. She lived life to the fullest — never forgoing an opportunity to laugh and dance.
I will miss her forever and will keep her memory alive in our hearts always. ❤️ pic.twitter.com/EyhrLNLUJw
— Ivanka Trump (@IvankaTrump) July 14, 2022