పవన్‌కళ్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ సినిమాలలో జల్సా ఒకటిగా నిలిచింది. ప్రేమకథకు యాక్షన్, కామెడీని జోడించి మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కించారు. జల్సా విడుదలై 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా (సెప్టెంబర్) 2న ఈ సినిమాను రీ-రిలీజ్ చేయబోతున్నారు. పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జల్సా సినిమా మరోసారి థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఒరిజినల్ ప్రింట్ ను క్యూబ్, 4 కే వెర్షన్స్ లోకి మార్చి రీ రిలీజ్ చేయనున్నారు. జల్సా సినిమాకు సంబంధించిన రీ రిలీజ్, ప్రమోషన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొందరు ఆర్గనైజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఏపీతో పాటు తెలంగాణలోని పలు థియేటర్లలో ఈ సినిమా స్క్రీనింగ్ ఉండబోతున్నట్లు తెలిసింది. త్వరలోనే బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.