జనగామలో విషాదం జరిగింది. జనగామ ఎస్సై శ్రీనివాస్ (55) దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. భార్య స్వరూప (50) మొదట ఉరేసుకొని చనిపోగా, కాసేపటికే ఎస్సై శ్రీనివాస్ తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకున్నారు. ఆత్మహత్య కంటే ముందే ఇంట్లో బాగా గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. కుటుంబ కలహాల వల్లే వీళ్లిద్దరూ ఆత్మహత్య చేసుకొని, చనిపోయారని ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రిల్ 6వ తేదీ గురువారం తెల్లవారుజామున అతని భార్య స్వరూప బాత్రూంలో ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని గుర్తించిన ఎస్సై శ్రీనివాస్.. తీవ్ర మనోవేదనకు గురయ్యారు.
అయితే… కుటుంబ కలహాల వల్లే ఆత్మహత్య జరిగిందా? మరేమైనా కారణాలున్నాయా? అని పోలీసుల విచారణలో అధికారికంగా తేలాల్సి వుంది. అయితే.. ఎస్సై శ్రీనివాస్ భార్య స్వరూప బాత్రూమ్ లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలియడంతో బంధువులు, స్నేహితులు ఇంటికి చేరుకున్నారు. ఎస్సై ని పరామర్శించారు. అప్పటి వరకూ బెడ్ రూమ్ లోనే వున్న ఎస్సై… వాష్ రూమ్ అని చెప్పి, లోపలికి వెళ్లి సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకున్నారు.