ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్. జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 1 నుంచి సీఎస్ గా జవహర్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తారు. ప్రస్తుత సీఎస్ సమీర్ శర్మ ఈ నెల 30 న పదవీ విరమణ చేయనున్నారు. మరో యేడాదిన్నర పాటు జవహర్ రెడ్డి సీఎస్ గా కొనసాగనున్నారు. ప్రస్తుతం సీఎం జగన్ కి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి పనిచేస్తున్నారు. 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. అయితే కొన్ని రోజుల పాటు ఆయన టీటీడీ ఈవోగా పనిచేశారు. ఆ పోస్టు చేస్తూనే సీఎంవోకి కూడా పనిచేశారు. ప
