రెండు వారాల క్రితం అమెరికా సుప్రీం కోర్టు రద్దు చేసిన గర్భస్రావ హక్కుపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కీలక సంతకం చేశారు. మహిళలకున్న గర్భస్రావ హక్కును కాపాడే ఫైల్ పై జో బైడెన్ సంతకం చేశారు. గర్భస్రావ హక్కును కాపాడడానికి గట్టి చర్యలు తీసుకోవాలని డెమోక్రెటిక్ పార్టీ సభ్యులు తీవ్ర ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో బైడెన్ ఈ కీలక సంతకం చేవారు. అయితే.. తుది నిర్ణయం మాత్రం అమెరికా కాంగ్రెస్ దేనని, కాబట్టి, తన సంతకంతో పరిమిత ప్రయోజనం మాత్రమే వుంటుందని కూడా బైడెన్ వివరించారు.
దేశంలో గర్భస్రావం చట్ట సమ్మతమైన రాష్ట్రాలకు మహిళలు వెళ్లి, ఫెడరల్ ప్రభుత్వం అనుమతించిన గర్భస్రావ మందులను తీసుకోడానికి కోర్టు తీర్పు ఏమాత్రం అడ్డంకి రాకుండా చేయాలన్నది బైడెన్ ఉత్తర్వుల్లోని ప్రధానాంశాలని వైట్ హౌజ్ వర్గాలు వివరిస్తున్నాయి. గర్భస్రావ హక్కును కాపాడడానికి కోర్టులో పోరాటాలు కూడా మొదలు పెట్టాలని బైడెన్ ఆరోగ్య శాఖకు సూచించారు కూడా.