Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

తెలంగాణ కుటుంబ పాలనలో చిక్కుకుపోయింది : బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయాన్ని వర్చువల్ గా ప్రారంభించారు. అయితే… షెడ్యూల్ ప్రకారం ఆయన శుక్రవారం తెలంగాణ పర్యటన ఖరారైంది. అయితే.. అది రద్దైంది. దీనిపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వివరణ ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల నడ్డా రాలేకపోయారని, మరోసారి వస్తారని తెలిపారు. ఇక.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ… కొత్తగా ఏర్పడిన రాష్ట్రం.. కుటుంబ పాలనలో చిక్కుకుపోయిందని విమర్శించారు. తెలంగాణను అవినీతి ఊబిలో దించారంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబం నియంతృత్వ ధోరణిలో పాలన సాగిస్తోందంటూ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ అంటే భారత్ రాష్ట్ర సమితి కాదని.. భ్రష్టాచార్ (అవినీతి) రిష్వత్ (లంచగొండి) సర్కార్ అని కొత్త నిర్వచనం ఇచ్చారు.

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తెలంగాణ.. మిగులు రాష్ట్రంగా ఆవిర్భవించిందని, అలాంటిది ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయిందని జేపీ నడ్డా ధ్వజమెత్తారు. మూడున్నర లక్షల కోట్ల రూపాయల మేర అప్పులు చేసిందని చెప్పారు. ఇంతగా లక్షల కోట్ల రూపాయల మేర అప్పులు చేసినప్పటికీ.. అభివృద్ధి శూన్యమని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో బీజేపీ కార్యాలయాలు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రాల్లో సంస్థాగతంగా పార్టీని విస్తరింపజేస్తున్నామన్నారు. దేశంలో ఇప్పటివరకు 500 బీజేపీ కార్యాలయాలు నిర్మించామని, ఇవి కార్యాలయాలు కాదు.. సంస్కార్ కేంద్రాలని నడ్డా పేర్కొన్నారు.

ఇక… తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీని తిడుతూ కల్వకుంట్ల కుటుంబం టైంపాస్ పాలిటిక్స్ చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మోడీని బ్రోకర్ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ బ్రోకర్..కేసీఆర్ పాస్ పోర్టు బ్రోకర్ అని మండిపడ్డారు.టీఎస్పీఎస్సీలో పేపర్ లీకై 30 లక్షల మంది భవిష్యత్ నాశనం అయితే..కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేసి..సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ట్విట్టర్ టిల్లు కేటీఆర్, లిక్కర్ క్వీన్ కవిత, హ్యాపీ రావు సంతోష్, అగ్గిపెట్టె రావు హరీష్ రావులే తెలంగాణను ఏలుతున్నారని బండి సంజయ్ దెప్పిపొడిచారు.

Related Posts

Latest News Updates