జూనియర్ ఎన్టీఆర్… అభిమానులకు అతి చేరువలో వుంటారని పేరు. ఆ కుటుంబం చూపించే ఆప్యాయత, అనురాగాలు అభిమానులను ఇట్టే కట్టిపడేస్తుంటాయి. తన కుటుంబం రోడ్డు ప్రమాదాల ద్వారా తీవ్రంగా నష్టపోవడం చూసి.. ఇలాంటి నష్టం ఎవ్వరికీ జరగకూడదని, తగు జాగ్రత్తలు సూచించిన పెద్ద మనస్సు జూనియర్ ఎన్టీఆర్ ది. తాను పాల్టొన్న ప్రతి ఈవెంట్ లో… తగు జాగ్రత్తలు చెబుతూనే వుంటాడు. ఈవెంట్ ముగిసిన తర్వాత అందరూ జాగ్ర్తత్తగా వెళ్లాలని కూడా సూచిస్తాడు. అభిమానులకు ఏదైనా జరిగితే.. అస్సలు తట్టుకోని మనస్తత్వం ఆయనది.
జూనియర్ ఎన్టీఆర్ మరో సారి తన గొప్ప మనసును చాటుకున్నారు. శ్రీకాళహస్తిలోని తన వీరాభిమాని చావు బతుకుల మధ్య వున్నాడని తెలుసుకున్న జూనియర్… అతడ్ని ఫోన్లో పరామర్శించాడు. అంతే కాకుండా తాను ఉన్నానన్న ధైర్యం కూడా చెప్పాడు. శ్రీకాళహస్తిలో వుండే జనార్దన్ అనే యువకుడు జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని. ఇటీవల అతడికి యాక్సిడెంట్ అయ్యింది. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ.. ప్రాణాపాయ స్థితిలో వున్నాడు. దీంతో ఆయన తల్లి తీవ్రంగా దు:ఖించింది.
చివరి సారిగా తన కొడుక్కి జూనియర్ ఎన్టీఆర్ ని చూపిస్తే తెగ సంతోషపడతాని భావించింది. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ పీఆర్వోకి చేరింది. దీంతో పీఆర్వో విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ కి చెప్పాడు. వెంటనే.. జూనియర్ ఎన్టీఆర్ జనార్దన్ అనే యువకుడితో ఫోన్లో మాట్లాడారు. ధైర్యం చెప్పారు. తనకేమీ కాదని, అండగా వుంటానని కూడా భరోసా ఇచ్చాడు. ఆస్పత్రికి అవసరమయ్యే ఖర్చులు కూడా ఇస్తానని ప్రకటించాడు జూనియర్ ఎన్టీఆర్.
Upon hearing that his fan, Janardhan's health is in critical condition, @tarak9999
reached out to Janardhan's mother. NTR also spoke to Janardhan through speaker phone and wished him a speedy recovery. pic.twitter.com/ckVHXyDe4M— Suresh Kondi (@SureshKondi_) June 29, 2022