మునుగోడు సభ సందర్భంగా నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షెడ్యూల్ ను బీజేపీ విడుదల చేసింది. అయితే… అనుకోకుండా అమిత్ షా షెడ్యూల్ లో అదిరిపోయే సర్ ప్రైజ్ అప్ డేట్ వచ్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను నటుడు జూనియర్ ఎన్టీఆర్ కలుసుకోనున్నారు. హైద్రాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో జూనియర్ ఎన్టీఆర్, అమిత్ షా డిన్నర్ చేయనున్నారు. అమిత్ షా ఆహ్వానం మేరకు జూనియర్ ఎన్టీఆర్ ఈ విందుకు హాజరువుతున్నారు. దీంతో… తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేగుతోంది.
2009 ఎన్నికల్లో టీడీపీ తరపున తారక్ ప్రచారం చేశారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. సినిమాలు చేసుకుంటున్నారు తప్ప ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. తాజాగా అమిత్ షా తో జూనియర్ ఎన్టీఆర్ కలవనున్న నేపథ్యంలో…. రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది. అయితే.. RRR సినిమాలో కొమురం భీం పాత్ర వేసిన ఎన్టీఆర్ నటనకు అమిత్ షా ఫిదా అయ్యారని, అభినందించడానికే ఈ భేటీ అని కొందరు అంటున్నారు.